Boyapati Srinu : బోయపాటీ .. మరీ ఇంత సెల్ఫిష్ గానా
X
వివి వినాయక్ తర్వాత తెలుగులో అంత ఊరమాస్ సినిమాలు తీసే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. కాకపోతే వినాయక్ సినిమాల్లో కథనం కాస్త నేల మీదే ఉంటుంది. బోయపాటి మాత్రం అన్ని బారికేడ్స్ దాటేస్తాడు. అతని హీరోలు యాక్షన్ సీన్స్ లో పిచ్చి పట్టిన వాళ్లలా బిహేవ్ చేస్తుంటారు. ఇది కొందరికి నచ్చింది. సినిమాలు హిట్ అయ్యాయి. జయ జానకి వరకూ బానే ఉన్న బోయపాటి వినయ విధేయ నుంచి దారి తప్పాడు. తన హీరోలను మరీ బఫూన్స్ గా మార్చాడు అనేది కొందరు విమర్శకుల అభిప్రాయం. యాక్షన్ సీన్ అంటే అతనికే ముందు పూనకం వస్తుంది. ఇది లిమిట్ లో ఉండటం లేదు. వినయ విధేయ డిజాస్టర్ అయినా అతని ఆస్థాన హీరో నందమూరి బాలకృష్ణ అఖండతో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ మరీ సిల్లీగా ఉందనే టాక్ వచ్చినా.. ఇప్పుడు దేశం ఉన్న మూడ్ ను బట్టి వాట్సాప్ సిలబస్ డైలాగ్స్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
అయితే అఖండ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. నచ్చేలా చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.. తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం. ఆ ఆర్ఆర్ లేకపోతే అఖండ నిజంగానే సిల్లీ పిక్చర్ అవుతుంది. బట్ ఈ క్రెడిట్ ను తమన్ కు ఇవ్వడానికి సిద్ధంగా లేడు బోయపాటి. అందుకే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో అఖండకు ఆర్ఆర్ వల్ల ఉపయోగం ఏం లేదు. ఆ సినిమా మ్యూట్ లో పెట్టుకుని చూసినా ఆ ఊపు వస్తుందని చీప్ కమెంట్ చేశాడు. యస్.. అఖండ మాత్రమే కాదు.. ఇప్పుడు ఏ సినిమా కూడా మ్యూట్ లో పెట్టుకుని చూసి భరించే శక్తి ప్రపంచంలోనే ఏ ప్రేక్షకులకూ లేదు. ఇది కేవలం అఖండ క్రెడిట్ లో తమన్ పర్సెంటేజ్ ఎక్కువగా వినిపిస్తోందనే అక్కసుతో మాత్రమే చేసిన కమెంట్ లా ఉందని విమర్శిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం కూడా దేవీ శ్రీ ప్రసాద్ నుంచి తను సంగీతం బలవంతంగా పిండుకున్నాను తప్ప అతని గొప్ప లేదన్నట్టు ఒక స్టేజ్ మీద మాట్లాడాడు. అప్పుడు వెంటనే దేవీ శ్రీ ప్రసాద్ రియాక్ట్ అయ్యాడు. మేము ఏమన్నా గేదెలమా పిండుకోవడానికి అని కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు తమన్ మీద పడ్డాడు. మరి ఆర్ఆర్ కు అంత ఇంపార్టెన్స్ లేకపోతే అఖండ తర్వాత కూడా మళ్లీ స్కందకు కూడా తమన్ నే ఎందుకు తీసుకున్నాడో..
ఏదేమైనా స్కంద మూవీతో బోయపాటి ఇమేజ్ పాతాళానికి వెళ్లిందనేది నిజం. ఎంత కన్విన్సింగ్ గా సినిమా చూసినా అతని టేకింగ్, మేకింగ్ కు చూసిన వాళ్లందరి మైండ్ ఖరామ్ అయింది. మరి బోయపాటి కమెంట్స్ కు తమన్ కౌంటర్ ఇస్తాడా లేక కామ్ గా ఉంటాడా అనేది చూడాలి.