Bramayugam : ఓటీటీలోకి భ్రమయుగం..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X
ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తోంది. సినిమాలు థియేటర్స్ లో విడుదలై రెండు నెలలు కాక ముందే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అంతలా ఓటీటీ క్రేజ్ పెరిగిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన భ్రమయుగం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. రాహుల్ సదాశివన్ డైరెక్టర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా మమ్ముట్టి నటన, రాహుల్ డైరెక్షన్ ‘భ్రమయుగం’ మూవీకి ప్లస్ అయ్యాయి.
కాగా, రూ.27 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ వేదికపైకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా సోనీలివ్ తెలిపింది. ఈ మూవీ మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.