Sundeep Kishan : ముగ్గురు హీరోయిన్స్‌తో బ్రేకప్..ఆ సీక్రెట్స్ చెప్పేసిన టాలీవుడ్ హీరో
X
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం 'ఊరి పేరు భైరవకోన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గత ఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయిన సందీప్ ఓ మంచి హీట్ కోసం కష్టపడుతున్నాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నాడు. హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విఐ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఊరుపేరు భైరవకోన మూవీలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్, సాంగ్స్ విడుదల అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 16వ తేదిన 'ఊరి పేరు భైరవకోన' సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ తరుణంలో సందీప్ కిషన్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్స్ గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఏకంగా మూడుసార్లు బ్రేకప్ అయ్యిందని, ఒకరితో నాలుగేళ్లు, మరొకరితో రెండేళ్లు, ఇంకొకరితో రెండున్నరేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తాను ప్రేమించిన ముగ్గురూ ఇండస్ట్రీలో హీరోయిన్లేనని, ఏళ్లతరబడి ప్రేమలో ఉన్నా కూడా వాళ్లు ఎవరనేది బయటకు రానివ్వలేదని తెలిపారు.
ఇకపోతే హీరోయిన్ రెజీనా తన లవర్ కాదని, తన బెస్ట్ ఫ్రెండ్ అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. తనకు చాలా విషయాల్లో సపోర్ట్‌గా రెజీనా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే తన పెళ్లి గురించి చాలా మంది అడుగుతున్నారని, కానీ తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నారు. ఊరి పేరు భైరవకోన సినిమాను ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు. సందీప్ కిషన్ తన బ్రేకప్స్ గురించి చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.