Home > సినిమా > బీఆర్ఎస్ అభ్యర్థుల వయసెంతో తెలుసా..?

బీఆర్ఎస్ అభ్యర్థుల వయసెంతో తెలుసా..?

బీఆర్ఎస్ అభ్యర్థుల వయసెంతో  తెలుసా..?
X

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. 115 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. పార్టీ ఈసారి టికెట్లు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది 50 నుంచి 70ఏండ్ల మధ్య వయసువారున్నారు. 70 ఏండ్లు దాటిన 9 మందికి అవకాశం ఇవ్వడం విశేషం.

ములుగు నుంచి తొలిసారిగా బరిలో నిలవనున్న బడే నాగజ్యోతి వయసు 29 ఏండ్లు. కేసీఆర్ ప్రకటించిన 115 మందిలో ఈమె అతి పిన్న వయస్కురాలు. కొత్తగూడెం నుంచి పోటీ చేయనున్న వనమా వెంకటేశ్వరరావు వయసు 78 ఏండ్లుకాగా.. అభ్యర్థుల్లో అందరికన్నా ఆయన పెద్దవారు. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ వయసు 69 సంవత్సరాలు.


వయసు అభ్యర్థులు

21-30 - 01

31-40 - 05

41-50 - 22

51-60 - 47

61-70 - 30

71 -80 - 09



Updated : 22 Aug 2023 3:59 PM IST
Tags:    
Next Story
Share it
Top