Home > సినిమా > Buchi Babu Sana : రామ్ చరణ్ కోసం శివన్నకు ఎందుకు తీసుకున్నారో తెలుసా..?

Buchi Babu Sana : రామ్ చరణ్ కోసం శివన్నకు ఎందుకు తీసుకున్నారో తెలుసా..?

Buchi Babu Sana : రామ్ చరణ్ కోసం శివన్నకు ఎందుకు తీసుకున్నారో తెలుసా..?
X

సౌత్ ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఎవరు.. అంటే వేరే ప్రశ్న లేకుండా వినిపించే ఏకైక పేరు విజయ్ సేతుపతి. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మొదలై.. హీరోగా మారి విలన్ గా ఆకట్టుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బెస్ట్ అనిపించుకుని ఇప్పుడు అన్ని రకాల పాత్రకూ మోస్ట్ వాంటెడ్ గా మారాడు.విజయ్ నటిస్తున్నాడు అంటే ఆ కథలో దమ్ముందని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయేలా మంచి కథలు కూడా ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తన విలనీతో మెప్పించాడు. త్వరలోనే మెర్రీ క్రిస్మస్ అనే సినిమాతో కత్రినా కైఫ్ కు జోడీగా గా వస్తున్నాడు. ఇలా ఎలా చూసినా విజయ్ సేతుపతి డేట్స్ కావాలంటే చాలా అంటే చాలా కష్టం అనిపించేసుకున్నాడు.

అయితే విజయ్ సేతుపతి ఫస్ట్ టైమ్ మెగా స్టార్ సైరాలో నటించాడు. అది ఆకట్టుకుంది. తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెనలో నటించాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి పాత్ర పెద్ద ప్లస్ అయింది. బుచ్చిబాబుకు ఫస్ట్ మూవీనే అయినా అతని కంటెంట్ ను నమ్మాడు. ఆ నమ్మకం నిజమైంది. ఆ తర్వాత కూడా విజయ్ కి తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయలేదు. ఇక బుచ్చిబాబు మరోసారి తన ప్రాజెక్ట్ లో అతన్ని తీసుకోవాలనుకున్నాడు. పైగా ఈ సారి రామ్ చరణ్ తో చేస్తున్నాడు కాబట్టి విజయ్ సేతుపతి గ్యారెంటీగా ఒప్పుకుంటాడు అనుకున్నారు. కానీ బుచ్చిబాబుకు గట్టి షాకే ఇచ్చాడు విజయ్ సేతుపతి.

రామ్ చరణ్ సినిమాలో తను నటించాలి అంటే 30 కోట్ల రెమ్యూనరేషన్ కావాలని అడిగాడట విజయ్ సేతుపతి. తన వల్ల తెలుగులో మంచి పేరు వచ్చింది కాబట్టి.. తన కోసమైనా రామ్ చరణ్ మూవీలో నటిస్తాడు అనుకున్నాడట బుచ్చిబాబు. బట్ విజయ్ మాత్రం కంటెంట్ కూడా వినకుండానే రెమ్యూనరేషన్ చెప్పాడట. దీంతో బుచ్చిబాబుకు దిమ్మ తిరిగిందని చెబుతున్నారు. దీంతో అతని ప్లేస్ లో మరో మంచి ఛాయిస్ గా కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ను తీసుకున్నారు. ఫ్యాన్స్ అంతా కరుణాద చక్రవర్తిగా పిలుచుకునే శివన్న ఆల్రెడీ గౌతమీపుత్ర శాతకర్ణిలో నటించాడు. కానీ అస్సలు గుర్తు పట్టలేనంతగా ఆ సినిమాలో అవమానించారు. బట్ ఈ సారి బుచ్చిబాబు లో బలమైన పాత్రతో వస్తున్నాడట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు. ఇక శివన్నతో రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ ఉండదు. 5 -10 లోపలే అయిపోతుంది. ఆడియన్స్ కు కూడా ఓ కొత్త కాంబో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక శివన్న రీసెంట్ గా జైలర్ సినిమాలో చేసిన నరసింహ పాత్ర పెద్ద ప్రభావం చూపించింది. అలాగే ఇప్పుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్ లో కూడా కీలక పాత్ర చేశాడు. ఇవన్నీ రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకు ప్లస్ అవుతాయి. మొత్తంగా రామ్ చరణ్ తో నటించేందుకు విజయ్ సేతుపతి 30 కోట్లు డిమాండ్ చేయడం వల్లే ఆ పాత్రలోకి శివన్న వచ్చాడంటున్నారు.


Updated : 8 Jan 2024 10:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top