Home > సినిమా > గెట్ రెడీ.. సూర్య భాయ్ వస్తున్నాడు

గెట్ రెడీ.. సూర్య భాయ్ వస్తున్నాడు

గెట్ రెడీ.. సూర్య భాయ్ వస్తున్నాడు
X

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సంద‌ర్భాన్ని బ‌ట్టి స్టార్ హీరోల పాత చిత్రాల‌ను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోల చిత్రాలు ఇలా విడుద‌లై మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఇక ఈ ట్రెండ్‌ను మొద‌లుపెట్టిన మ‌హేశ్ బాబు ఇప్పుడు మ‌రోసారి రీరిలీజ్‌కు సిద్దం అవుతున్నారు. ‘పోకిరి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా త‌రువాత మ‌హేశ్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘బిజినెస్‌మేన్‌'. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. ఆర్ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్ఆర్ వెంక‌ట్ నిర్మించారు. 2012 జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. నెగిటివ్ రోల్ లాంటి డిఫ‌రెంట్ పాత్ర‌లో మ‌హేశ్ న‌ట‌న అదుర్స్ అనిపించేలా ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ఈ చిత్రం వచ్చి ప‌దేళ్లు దాటినా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. . హీరో క్యారెక్టరైజేషన్ పీక్ స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటుందో బిజినెస్ మాన్ సినిమా నిరూపించింది. సూర్య భాయ్ అనే గ్యాంగ్ స్టర్ గా మహేష్ ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఈ మూవీలోని ప్రతి డైలాగ్ కి ఫాన్స్ ఉన్నారు, హార్డ్ రియాలిటీని డైలాగ్స్ లో పూరి సూపర్బ్ గా చెప్పాడు. సినిమాలోని డైలాగ్‌లు మీమ్స్ రూపంలో ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఆరోజు బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ చెయ్యనున్నారు. దీంతో అభిమానులు సూర్య భాయ్ మ‌ళ్లీ వ‌స్తున్నాడు అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.







Updated : 2 July 2023 2:45 PM IST
Tags:    
Next Story
Share it
Top