Captain Miller Update : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న మరో సినిమా.. కారణం ఏంటంటే..?
X
సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. కోడిపందాల హవా ఒకవైపు.. వెండితెర రేసు మరోవైపు. ఈసారి పండగకు కూడా ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటన్నింటికి థియేటర్లు దొరకడం కష్టమే. ఈ క్రమంలో కొన్ని సినిమాలు రేసు నుంచి తప్పుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో పాంచ్ పటాకా ఖాయమని అంతా అనుకున్న టైంలో.. అనూహ్యంగా రవితేజ నటించిన ఈగల్ మూవీ బరి నుంచి తప్పుకుంది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే మరో సినిమా ఆ రేసు నుంచి బయటికొచ్చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలే సంక్రాంతికి పోటీకి వస్తాయనుకుంటే.. ఈసారి కొత్తగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతున్నట్లు డేట్స్ ప్రకటించాయి.
అలా జనవరి 12న ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ నటించిన అయలాన్ సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ రెండు సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. థియేటర్లు దొరకక పోవడం, కలెక్షన్లు తగ్గుతాయనే కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. మిగతా భాషలు, రాష్ట్రాల్లో ప్రకటించిన డేట్స్ కే ఈ సినిమాలను విడుదల చేస్తున్నట్లు సమాచారం.