Home > సినిమా > 'కెప్టెన్‌ మిల్లర్‌' టీజర్‌ వచ్చేసింది..యాక్షన్‌ సీన్స్‌‎లో ధనుష్ విధ్వంసం

'కెప్టెన్‌ మిల్లర్‌' టీజర్‌ వచ్చేసింది..యాక్షన్‌ సీన్స్‌‎లో ధనుష్ విధ్వంసం

కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ వచ్చేసింది..యాక్షన్‌ సీన్స్‌‎లో ధనుష్ విధ్వంసం
X

సౌత్‌ ఇండియా స్టార్‌ ధనుష్‌ కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం 'కెప్టెన్‌ మిల్లర్‌'. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‎గా నటిస్తోంది. సందీప్‌ కిషన్‌తో పాటు శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఇక ఇవాళ ధనుష్‌ బర్త్ డే సందర్భంగా మూవీ యూనిటి ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ను విడుదల చేసి మేకర్స్‌ ఫ్యాన్స్‎ను ఖుష్ చేశారు. నెట్టింట్లో ఈ టీజర్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ధనుష్ పవర్‎ఫుల్ పెర్ఫార్మెన్స్‎ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


కెప్టెన్‌ మిల్లర్‌ పీరియాడికల్ చిత్రమని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్‌ చూస్తే ఇది 1930-40ల సాగే కథ అని అర్థమవుతోంది. ఈ టీజర్‎లో ధనుష్‌ ఫస్ట్ వరల్డ్ వార్‎లో ఉపయోగించిన లూయిస్‌ మెషిన్‌ గన్‌ తో దర్శనమిచ్చాడు. చేతిలో గన్ పట్టుకొని యుద్ధభూమిలో కనిపించి ఫ్యాన్స్‎ను ఇంప్రెస్ చేశాడు. 100 సెకన్ల లోపు మాత్రమే ఉన్న ఈ టీజర్ లో సినిమాలోని దాదాపు అన్ని కీ రోల్స్‏ను చూపించారు మేకర్స్. ధనుష్‌ తుపాకీతో తూటాలు పేల్చిన తీరు మాత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కెప్టెన్‌ మిల్లర్‌ మూవీని డిసెంబర్ 15న పాన్‌ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ధనుష్‌ సినీ కెరీయర్‌లోనే ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. పీరియాడిక్ సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలను పెంచింది.


Updated : 28 July 2023 9:29 AM IST
Tags:    
Next Story
Share it
Top