Home > సినిమా > చిక్కుల్లో హీరో విజయ్‌.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు

చిక్కుల్లో హీరో విజయ్‌.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు

చిక్కుల్లో హీరో విజయ్‌.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు
X

తమిళ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. విజయ్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ఈ సినిమా నుంచి ‘నా రెడీ’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ అయిన గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ పాట. అయితే ఈ పాటలో విజయ్ చాలా చోట్ల సిగరెట్ తాగుతూ కనిపించాడు. దాంతో ఓ సామాజిక కార్యకర్త.. పాటలో మత్తు పదార్థాల వాడకాన్ని, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించారని నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద ఆన్లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో సినిమా యూనిట్, హీరో విజయ్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఈ విషయం స్పందించిన పలువురు నేతలు.. విజయ్ మాట తప్పాడని కామెంట్ చేశారు. 2012లో తాను నటించే ఏ సినిమాలోనూ సిగరెట్ తాగనని హామీ ఇచ్చి మాట తప్పాడని మండిపడ్డారు. ఇటీవల తమిళనాడులో 10,12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన పిల్లలను సత్కరించిన విజయ్.. మంచి మార్గంలో నడవాలని, డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని సూచించాడు. అలాంటి మాటలు చెప్పిన విజయ్ సినిమాలో సిగరెట్ తాగడం ఏంటని తప్పుబట్టారు.

Updated : 26 Jun 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top