Home > సినిమా > Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక

Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక

Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేమ్  షణ్ముక
X

బిగ్‌బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముక జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. అతడితో పాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్‌పై ఓ యువతి కేసు పెట్టగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు హైదరాబాద్‌లోని అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో సోదాలు చేపట్టగా గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములీద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. షణ్ముక అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్‌పై యువతి ఫిర్యాదు చేసింది.

పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్‌కు వెళ్లారు. పోలీసుల తనిఖీల్లో ప్లాట్‌లో గంజాయి దొరికింది. దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.ఆరు రోజుల్లో పెళ్లి.. అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నాడని బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ సోదరుడు సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేశారు. గతంలో హిట్ అండ్ రన్ కేసులోనూ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యాడు. అయితే అప్పుడు తను మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుంచి ఏలాగోలా బయటపడ్డాడు. యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారాడు షణ్ముఖ్. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఫేమ్‌తోనే అతడు బిగ్ బాస్-5లోకి ఎంటర్ అయ్యాడు.

Updated : 22 Feb 2024 12:13 PM IST
Tags:    
Next Story
Share it
Top