Home > సినిమా > సెలబ్రిటీల క్రికెట్ టోర్నీ.. ఫ్రీగా చూడొచ్చిలా..!

సెలబ్రిటీల క్రికెట్ టోర్నీ.. ఫ్రీగా చూడొచ్చిలా..!

సెలబ్రిటీల క్రికెట్ టోర్నీ.. ఫ్రీగా చూడొచ్చిలా..!
X

సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్ 10వ ఎడిషన్‌ ప్రారంభానికి ముస్తాబు అవుతోంది. మన తెలుగు వారియర్స్ తో పాటు ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్, భోజ్ పురి దబాంగ్స్, కర్నాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్, చైన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ ఇలా మొత్తం ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సీజన్ లోని మొదటి ఐదు మ్యాచులను దుబాయ్ లోని షార్జాలో నిర్వహించనున్నారు. తర్వాత మ్యాచులు బెంగళూరు, హైదరాబాద్, చండీఘడ్, తిరువనంతపురం, విశాఖపట్నం స్టేడియాల్లో జరగనున్నాయి. కాగా ఈ టోర్నీని జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు. ఫిబ్రవరి 23న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మార్చి 17వ తేదీ వరకు జరుగుతుంది. తొలి మ్యాచ్ లో ముంబై హీరోస్‌-కేరళా స్ట్రైకర్స్‌ తలపడనున్నాయి. మన తెలుగు వారియర్స్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 24న భోజ్ పురి దబాంగ్స్ తో షార్జాలో తొలి మ్యాచ్ ఆడనుంది. రెండో మ్యాచ్‌ మార్చి 1న పంజాబ్‌ దే షేర్‌తో హైదరాబాద్‌లో జరగనుంది.

• మార్చి 3న కేరళ స్ట్రైకర్స్‌తో హైదరాబాద్‌లో

• మార్చి 9న కర్నాటక బుల్డోజర్స్‌తో తిరువనంతపురంలో

• మార్చి 15, 16వ తేదీల్లో క్వాలిఫైయర్‌ 1, ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి.

• మార్చి 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.


Updated : 14 Feb 2024 9:31 PM IST
Tags:    
Next Story
Share it
Top