మెగా వారసురాలు వచ్చేసింది..తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మెగా కుటుంబంలోకి మెగా వారసురాలు వచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం తల్లీ , బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా వారసురాలు పుట్టడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం ఉపాసన అడ్మిట్ అయ్యింది. ఉపాసన వెంట ఆమె భర్త రామ్ చరణ్, అత్త సురేఖ తో పాటు ఆమె తల్లీ మిగతా కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు వెళ్లారు . ఈ రోజు తెల్లవారుజామున ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చిందని ఆసుపత్రి సిబ్బంది ఒక స్పెషల్ మెడికల్ బులెటిన్‌ను విడుదల చేసింది.
చరణ్, ఉపాసననలు ప్రేమించి , పెద్దలను ఒప్పించి 2012లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 11 సంవత్సరాల వీరి దాంపత్య జీవితం అనంతరం ఈ కపుల్స్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని గతేడాది డిసెంబరు 12న రెండు కుటుంబాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ మధ్యనే ఉపాసన సీమంతం వేడుకలను పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహించారు. రీసెంట్గా ఉపాసన, పిల్లలు పుట్టిన తరువాత మేము అత్తామామలతో ఉండాలని డిసైడ్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తమ అభివృద్ధికి గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్రను పోషించారని, అదే విధంగా తమ పిల్లలను నానమ్మ, తాతయ్యలతో ఉంటే వచ్చే ఆనందాన్ని దూరం చేయాలనుకోవడం లేదని చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.