Home > సినిమా > Chiranjeevi : అభినందనల వర్షం..సందడిగా మారిన చిరంజీవి నివాసం

Chiranjeevi : అభినందనల వర్షం..సందడిగా మారిన చిరంజీవి నివాసం

Chiranjeevi  : అభినందనల వర్షం..సందడిగా మారిన చిరంజీవి నివాసం
X

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనేక మంది మెగాస్టార్‌కు అభినందనలు తెలుపుతున్నారు. నేడు కూడా చిరంజీవిపై ప్రసంశల వర్షం కురిసింది. శనివారం మెగాస్టార్ ఇంటికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ ప్రొడ్యూస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణలు వెళ్లారు. చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పి తమ ఆనందాన్ని పంచుకున్నారు.




మరోవైపు యానిమల్ మూవీతో అద్భుత విజయాన్ని అందుకున్న హిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి వచ్చిన వారందరితో మెగాస్టార్ ముచ్చటించారు. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సైతం చిరంజీవికి ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


Updated : 27 Jan 2024 9:07 PM IST
Tags:    
Next Story
Share it
Top