Home > సినిమా > ఓనం సంబరాల్లో సినీతారలు..కేరళ చీరల్లో భామలు..సాంప్రదాయంగా హీరోలు..

ఓనం సంబరాల్లో సినీతారలు..కేరళ చీరల్లో భామలు..సాంప్రదాయంగా హీరోలు..

ఓనం సంబరాల్లో సినీతారలు..కేరళ చీరల్లో భామలు..సాంప్రదాయంగా హీరోలు..
X

కేరళలో జరిగే అతి పెద్ద పండుగ ఓనం. ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతికరమైనది. తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగవైభవంగా ఎలా జరుపుకుంటారో మలయాళీలు అదే తరహాలో ఓనం‎ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకటి కాదు రెండు కాదు ఈ పండుగను 10 రోజుల పాటు ఎంతో వైభంగా జరుపుకుంటారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, వ్యవసాయనికి ముడిపడిన పండుగ ఓన‌ం. ఇవాళ ఓనం కావడంతో సెలబ్రెషన్లలో సినీతారలు బిజీ అయ్యారు. సెలబ్రిటీలు కేరళ వస్త్రధారణలో ముస్తాబై వారి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఓనమ్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరోలు కూడా మేము ఏమన్నా తక్కువ తిన్నామా అంటూ సాంప్రదాయ వస్త్రధారణలో ఫోటోలను నెట్టింట్లో వదులుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఓనం పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక్కో తార ఒక్కోలా కేరళ చీరల్లో అందంగా రెడీ అయ్యి ఫ్యాన్స్‎ను ఫిదా చేస్తున్నారు.
































Updated : 29 Aug 2023 5:23 PM IST
Tags:    
Next Story
Share it
Top