Home > సినిమా > అశ్లీల కంటెంట్పై ఓటీటీలకు కేంద్రం ఝలక్

అశ్లీల కంటెంట్పై ఓటీటీలకు కేంద్రం ఝలక్

అశ్లీల కంటెంట్పై ఓటీటీలకు కేంద్రం ఝలక్
X

థియేటర్స్లో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ తప్పనిసరి. కానీ ఓటీటీలకు సెన్సార్ ఉండదు. దీంతో అశ్లీలత, హింసకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఓటీటీలకు సైతం సెన్సార్‌షిప్‌ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు కీలక సూచనలు చేసింది.

అశ్లీలత, హింసతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేసే ముందు ఓటీటీ సంస్థలు స్వీయ సమీక్ష చేయాలని సూచించింది. జూన్‌ 20న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఓటీటీ సంస్థలతో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలను ఓటీటీ సంస్థలు వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుకోకుండానే సమావేశం ముగిసిందని ఓటీటీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

భారత్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వాటికి అడ్డంకులుగా మారే అవకాశం ఉందని పలువురు ఓటీటీ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మరోవైపు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు మాత్రం ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌పై ప్రత్యేక సెన్సార్‌షిప్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అమెజాన్ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్‌ యూనిట్‌, వైకామ్‌ 18, యాపిల్‌ టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు.



Updated : 15 July 2023 5:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top