Home > సినిమా > కల్కీ2898AD సినిమాకు.. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం

కల్కీ2898AD సినిమాకు.. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం

కల్కీ2898AD సినిమాకు.. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం
X

‘పురాణాలను పూసగుచ్చినట్లు వివరించాలన్నా.. దేవుళ్లు, రాజులకు ఎలివేషన్స్ ఇవ్వాలన్నా చాగంటి కోటేశ్వరరావు తర్వాతే ఎవరైనా’ అంటుంటారు చాలామంది. ఆయన ప్రవచనాల్లో.. ఎలివేషన్స్ అలా ఉంటాయి మరి. దైవావతారం గురించి ఆయన వివరిస్తుంటే.. కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఓసారి శ్రీ మహావిష్ణు కల్కీ అవతారం గురించి ప్రవచనాల్లో బోధించారు చాగంటి. ఆయన పుట్టుక, దాని తాత్పర్యాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD సినిమా కల్కీ అవతారం అని.. గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. కలియుగంలో రాక్షసుల భారి నుంచి ప్రజలను కాపాడటానికి కల్కి వస్తాడు. అదే క్యారెక్టర్ ను ప్రభాస్ సినిమాలో పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ అయిన కల్కి2898AD సినిమా గ్లింప్స్ ను ఓ నెటిజన్ ఎడిట్ చేశాడు. దానికి చాగంటి ప్రవచనం ఆడియోను జోడించి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అంతేకాకుండా మరిన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘గూస్ బంప్స్ తెప్పిస్తోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.




Updated : 22 July 2023 5:58 PM IST
Tags:    
Next Story
Share it
Top