నిహారికపై చైతన్య తండ్రి సంచలన ఆరోపణలు..!
X
మెగా డాటర్ నిహారిక, చైతన్న దంపతులు విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వారు విడిపోయి రోజులు గడుస్తున్నా ఈ చర్చ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ కపుల్స్ ఎందుకు విడిపోయారనేది ఇంతవరకు సస్పెన్సె. ఇరు కుటుంబాలు కూడా దీనిపై ఎక్కడా మాట్లాడలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ చైతన్యపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. పలువురు నిహారికను విమర్శిస్తున్నారు. ఈ విషయంపై చైతన్య తండ్రి తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
నిహారిక తమ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోలేదని జొన్నలగడ్డ ప్రభాకర్ అన్నట్లు తెలుస్తోంది. ‘‘ ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా వ్యవహరించలేదు. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేనట్లు అనిపించింది. భర్తపై ఆమె ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగేది. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయితే మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని సహించలేకపోతున్నా’’ అని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఇవి పుకార్లు అని కొట్టిపారేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది నిజమని అంటున్నారు. భర్త, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్లే వారు విడిపోయారని చెబుతున్నారు. అయితే స్వయంగా వారు స్పందిస్తే తప్ప ఈ కామెంట్స్ ఆగేలా లేవు.