నన్ను మా ఆయన నమ్మితే చాలు.. నారా భువనేశ్వరి
X
వైసీపీ నాయకులు తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి ఘాటుగా స్పందించారు(Chandrababu Wife Nara Bhuvaneswari Slams YSR Congress Leaders) పనిపాటలు లేని వాళ్లు ఏదోదో వాగుతంటారని, అవన్నీ పట్టించుకోనని అన్నారు. ‘మగాడు ఏదైనా మట్లాడతాడు. ఈ సృష్టికి మూల ఆడది అనే విషయం మరిచిపోయారు’’ అని ఆమె అన్నారు. తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి మాటలకు జడిని తన వ్యక్తిత్వమేమిటో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తన భర్త ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
తమను రాజకీయంగా ఎదర్కోలేకనే వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని అన్నారు. ‘‘నాకు జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోను.. నేను అలాంటిదాన్ని, ఇలాంటిదాన్ని అన్నారు. నేనొక విషయం స్పష్టం చేస్తున్నా. నేనేమిటో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు మనస్సాక్షి ఉంది. అది మా ఆయన నమ్మితే చాలు. వేరేవాళ్లు ఏ వాగినా అనవరం. ఇక్కడున్న మహిళలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాను. మగాడు ఏదైనా మాట్లాడుతాడు. మనం పట్టించుకోవద్దు. ఎప్పుడూ రాని స్త్రీలు ఇప్పుడు బాబు అరెస్ట్‌తో బయటికి వస్తున్నార’’ అని భువనేశ్వరి అన్నారు.