Home > సినిమా > Chandramukhi 2 Trailer Telugu :చంద్రముఖి 2.. ట్రైలర్ నిజంగా బాగుందన్నా!

Chandramukhi 2 Trailer Telugu :చంద్రముఖి 2.. ట్రైలర్ నిజంగా బాగుందన్నా!

Chandramukhi 2 Trailer Telugu :చంద్రముఖి 2.. ట్రైలర్ నిజంగా బాగుందన్నా!
X

2004లో రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రాబోతున్న విషయం తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌లో ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యేదుంకు సిద్ధంగా ఉంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌‌లో జోరు పెంచింది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ స్వాగతాంజలి సాంగ్‌తోపాటు సెకండ్‌ సింగిల్‌ Moruniyeకు మంచి స్పందన వస్తోంది. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ పోస్టర్, అప్ డేట్ కు మంచి స్పందన వచ్చింది. దాంతో అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. దాంతో ఆదివారం (సెప్టెంబర్ 3) చిత్న బృందం ట్రైలర్ ను లాంచ్ చేసింది.





సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చంద్రముఖి 2లో లెజెండ‌రీ కమెడియ‌న్ వడివేలు కీ రోల్‌ పోషిస్తున్నాడు. లేట్ ఆర్ఎస్ శివాజీ నటించిన చివరి సినిమా ఇదే. కాగా, ట్రైలర్ సినీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 17 ఏళ్ల తర్వాత తాను బందీగా ఉన్న గది తలుపులు తెరుచుకోవడంతో.. వేట్టయ రాజాపై చంద్రముఖి పగ ఏలా తీర్చుకుంది అనేది స్టోరీ. చంద్రముఖి భవనం యజమాని వడివేలు.. బిల్డింగ్ చూడటానికి రావడంతో ట్రైలర్ మొదలవుతుంది.

అమాయక ఫ్యామిలీ చంద్రముఖికి ఎలా చిక్కింది. హీరో దాని భారి నుంచి ఎలా కాపాడాడు అని ట్రైలర్ లో కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు చంద్రముఖి సినిమా సీక్వెల్ లా కాకుండా డబ్ చేసిన ఫీల్ వస్తుంది. అయితే, చివర్లో వడివేలు డైలాగ్ తో సినిమాలో ఏదో కొత్త స్టోరీ, ట్విస్ట్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ సినిమా.





Updated : 3 Sept 2023 8:11 PM IST
Tags:    
Next Story
Share it
Top