Home > సినిమా > Ram Charan : బెస్ట్ హజ్బెండ్..ఉపాసన కాళ్లు నొక్కిన చరణ్

Ram Charan : బెస్ట్ హజ్బెండ్..ఉపాసన కాళ్లు నొక్కిన చరణ్

Ram Charan : బెస్ట్ హజ్బెండ్..ఉపాసన కాళ్లు నొక్కిన చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక్కడే కాదు, విదేశాల్లోనూ ఆయనకు క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఏ చిన్న విరామం దొరికిన తన భార్య ఉపాసనతో పాటు టూర్లకు వెళుతుంటాడు చరణ్. అయితే తాజాగా తన భార్య ఉపాసన కాళ్లు నొక్కుతూ కనిపించాడు చరణ్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





ప్రముఖ బిజినెస్మ్యాన్ ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వస్తున్నారు. ఈ వేడుకలకు రామ్ చరణ్, ఉపాసనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. దీంతో స్పెషన్ ఫ్లైట్ లో జాంనగర్ బయల్దేరారు రామ్ చరణ్ దంపతులు. ఫ్లైట్ మధ్యలో ఉపాసన చిన్న కునుకు తీసింది. అయితే పక్కనే ఉన్న చరణ్ భార్య కాళ్లు నొక్కుతూ కనిపించారు. దీన్నంతా పక్కన ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అదికాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.





ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ..చరణ్‌కు బెస్ట్‌ హజ్బెండ్‌ అవార్డు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా భార్యకు సేవ చేయడం చరణ్‌కు కొత్తేమీ కాదు. ఇంటి పనుల్లో సాయం చేయడం, కాఫీ చేసి ఇవ్వడం, షాపింగ్‌కు వెళ్తే బ్యాగులు మోయడం ఇలా హెల్ప్ చేస్తునే ఉంటాడు. భార్య, భర్త ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని గుర్తు చేస్తునే ఉంటాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ భార్య దగ్గర గర్వం లేకుండా తగ్గి ఉంటున్న చరణ్ ఎందరో మగాళ్లకు ఆదర్శం అంటున్నారు ఫ్యాన్స్.





Updated : 2 March 2024 8:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top