Home > సినిమా > తేడా కొట్టిన భోళా శంకర్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

తేడా కొట్టిన భోళా శంకర్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

తేడా కొట్టిన భోళా శంకర్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
X

మెగా స్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా భోళా శంకర్. తమిళ సినిమా 'వేదాళం' రీమేక్ వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అంచనాలను అందుకోలేదని కొందరు అంటున్నారు. దీంతో ఈ ప్రభావం మొదటి రోజు కలెక్షన్ల పై పడింది. తొలి రోజు ఇండియాలో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాల అంచనా. ఫస్ట్ డే 61.92 శాతం ఆక్యుపెన్సీ కలిగి ఉందని తెలిపాయి. నైజాంలో రూ.22 కోట్లు, సీడెడ్ లో రూ. 12 కోట్లు, ఏపీలో రూ. 33. 60 కోట్ల షేర్ వచ్చినట్లు టాక్. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 67. 60 కోట్ల బిజినెస్ అయింది. దీంతోపాటు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 7 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ. 79.60 కోట్ల బిజినెస్ జరిగింది.




Updated : 12 Aug 2023 12:06 PM IST
Tags:    
Next Story
Share it
Top