‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ వచ్చేసింది..చిరంజీవి చింపేశాడు..
X
మెగాస్టార్ చిరంజీవి నూతన చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మరో ప్రధాన పాత్రల్లో కీర్తిసురేశ్ కనిపించనుంది. ఇప్పటికే భోళా శంకర్ నుంచి వచ్చిన అప్డేట్స్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. భోళా మేనియా, జాం జాం జజ్జనక గీతాలు శ్రోతలను అలరిస్తున్నాయి.
తాజాగా ‘మిల్కీ బ్యూటీ’ అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. చిరు-తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాట యువతను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ తన గ్రేస్ స్టెప్స్‌తో ఇరగదీశారు. ‘మిల్కీ బ్యూటీ’ పాటకు మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. మహతి స్వరసాగర్, విజయ్ ప్రకాశ్, సంజన కల్మాంజే ఆలపించారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ‘మిల్కీ బ్యూటీ’ పాటపై మీరు ఓ లుక్కేయండి.