Home > సినిమా > భోళా శంకర్ నుంచి మరో సాంగ్.. ఫ్యాన్స్కు పండగే..

భోళా శంకర్ నుంచి మరో సాంగ్.. ఫ్యాన్స్కు పండగే..

భోళా శంకర్ నుంచి మరో సాంగ్.. ఫ్యాన్స్కు పండగే..
X

వాల్తేర్ వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న మరో మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ అగస్ట్ 11న రిలీజ్ కానుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైనా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది.

భోళా శంకర్ నుంచి రెండో సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. జాం జాం జాం జాం జజ్జనక... తెల్లార్లూ ఆడుదాం తయ్యితక్క అనే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఫుల్ సాంగ్ను జులై 11న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఇటీవల ఈ పాట మేకింగ్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. ఈ సాంగ్కు చిరంజీవి, సుశాంత్, కీర్తి సురేష్, తమన్నా స్టెప్పులేశారు.



ఈ సినిమా తమిళ వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు.

భోళా శంకర్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని ఇటీవలె చిరంజీవి తెలిపారు. ‘‘భోళా శంకర్ సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందం కలిగించింది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.


Updated : 9 July 2023 2:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top