అసలు ఏం ప్లాన్ చేస్తున్నావ్ అన్నా.. హనుమాన్గా చిరంజీవి..
X
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో విభిన్న తరహాలో సినిమాలు చేస్తూ ప్రేక్షులను మెప్పించాడు. ప్రస్తుతం తేజ సజ్జ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. మొదట ఈ సినిమాను చిన్న సినిమాగా భావించారంతా. కానీ, టీజర్ రిలీజ్ చేశాక అందరి అంచనాలు తారుమారయ్యాయి. కొత్త కాన్సెప్ట్, వీఎఫ్ఎక్స్ భారీ సినిమాను తలపించేలా ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో వెళ్లిపోయింది. కాగా ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల లేట్ అయింది. తాజాగా పెద్ద హీరోలకు పోటీనిచ్చేందుకు.. సంక్రాంతి 12 ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య పాత్రలో చూపించబోతున్నారట. దీనికోసం చిత్ర బృందం మొత్తం చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేశాయని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో చిరంజీవికి హనుమాన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కుటుంబం కూడా హనుమాన్ భక్తులే. ఈ కారణంతో చిరంజీవిని హనుమాన్ సినిమా కోసం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే, చిరంజీవి క్లైమాక్స్ లో హనుమాన్ పాత్రలో కనిపించడం కాయం. ఈ విషయం తెలిసి సినీ ప్రియులు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.