Home > సినిమా > Chiranjeevi : వరుణ్ మీద చిరంజీవి కోపం.. ఆ విషయం చెప్పలేదంటూ..

Chiranjeevi : వరుణ్ మీద చిరంజీవి కోపం.. ఆ విషయం చెప్పలేదంటూ..

Chiranjeevi  : వరుణ్ మీద చిరంజీవి కోపం.. ఆ విషయం చెప్పలేదంటూ..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీ ఆపరేషన్ వాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా చేస్తోంది. పుల్వామా అటాక్కు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 1న ఈ సినిమా విడుదల అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. భారత్-పాక్ యుద్ధ సన్నివేశాలతో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు మూవీ యూనిట్ మూవీ ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది.

ఇక ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా చిరు-వరుణ్ని సుమ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది. వరుణ్ - లావణ్య లవ్ మ్యాటర్ను ఎందుకు లీక్ చేయలేదని చిరును సుమ ప్రశ్నించారు. ముందు వాళ్ల లవ్ స్టోరీ గురించి తనకు చెప్పలేదని చిరు ఆన్సర్ ఇచ్చాడు. ‘‘వరుణ్ వాళ్ల నాన్నకు చెప్పలేని కొన్ని విషయాలను నాకు చెప్తాడు. కానీ లవ్ మ్యాటర్ నాకు చెప్పలేదు. అందుకే అతడిపై నాకు కోపం ఉంది’’ అని చిరు అన్నారు.

గౌరవంతో కూడిన భయం వల్లే పెద్దనాన్నకు చెప్పలేదని వరుణ్ చెప్పాడు. కానీ అంతా ఒకే అయ్యాక ఫస్ట్ చిరుకే చెప్పినట్లు తెలిపారు. కాగా అంతకుముందు ప్రమోషన్స్ లో జనసేనకు ప్రచారంపై వరుణ్ స్పందించాడు కుటుంబ పెద్ద ఆదేశిస్తే పవన్ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించారు. పవన్ సహా ఆయన సిద్ధాంతాలపై నమ్మకం ఉందని.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పారు. ఇక కంచె తర్వాత దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ జరిగిందని.. అందుకే ఈ మూవీకి ఆపరేషన్ వాలంటైన్ అని పెట్టినట్లు వివరించారు. ఈ మూవీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.






Updated : 26 Feb 2024 7:07 AM IST
Tags:    
Next Story
Share it
Top