Home > సినిమా > Chiranjeevi : ఎలా స్పందించాలో తెలియడం లేదు.. ఎమోషనల్ అయిన చిరంజీవి.. వీడియో

Chiranjeevi : ఎలా స్పందించాలో తెలియడం లేదు.. ఎమోషనల్ అయిన చిరంజీవి.. వీడియో

Chiranjeevi : ఎలా స్పందించాలో తెలియడం లేదు.. ఎమోషనల్ అయిన చిరంజీవి.. వీడియో
X

దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్.. టాలీవుడ్ నటుడు చిరంజీవి వరించింది. ఈ విషయంపై సినీ, రాజకీయ ప్రముఖలు చిరంజీవిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన చిరంజీవి.. అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. పద్మవిభూషణ్ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై ఎలా స్పందించాలో తెలియడం లేదని, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పారు. ‘దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకదానికి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా ఆధరించిన అభిమానులకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, అండదండలు, ప్రేమ, ఆదరణ కారణంగానే.. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కిన ఈ గౌరవం మీ అందరిదీ. ఈ ప్రేమకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’అని భావోద్వేగానికి లోనయ్యారు.

45 ఏళ్ల సినీ ప్రస్థానంలో భిన్నమైన పాత్రల్లో నటించిన చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నిజ జీవితంలోనూ అవసరమైన సమయంలో సమాజానికి తనవంతు సాయం అందిస్తూనే వస్తున్నారు. కాగా తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.






Updated : 26 Jan 2024 8:28 AM IST
Tags:    
Next Story
Share it
Top