Home > సినిమా > padma awards list 2024: మాజీ సీఎంకు భారతరత్న.. చిరంజీవి, వెంకయ్యనాయుడులకు పద్మ విభూషన్.. వీరితో పాటు..!

padma awards list 2024: మాజీ సీఎంకు భారతరత్న.. చిరంజీవి, వెంకయ్యనాయుడులకు పద్మ విభూషన్.. వీరితో పాటు..!

padma awards list 2024: మాజీ సీఎంకు భారతరత్న.. చిరంజీవి, వెంకయ్యనాయుడులకు పద్మ విభూషన్.. వీరితో పాటు..!
X

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిష్టాత్మక, అసాధారణ సేవలందించిన దేశ పౌరులకు భారత రత్న, పద్మ విభూషన్, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరిస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవిలకు దేశ రెండో అత్యున్నత పైర పురస్కారం ‘పద్మ విభూషన్’ వరించింది. వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యంలనూ పద్మ విభూషన్ పురస్కారం దక్కించుకున్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మొత్తం ఐదుగురికి పద్మ విభూషన్, 17 మందికి పద్మ భూషన్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు ప్రతిష్టాత్మక అవార్డ్ భారతరత్న వరించింది.





కేంద్రం.. దేశంలో అసాధారణమైన విశిష్ట సేవలందించిన వారికి పద్మవిభూషణ్‌, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు చేసిన వారికి పద్మభూషణ్‌, విశిష్ట సేవలందించినవారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటిస్తుంది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీ అవార్డ్ దక్కింది. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు కు పద్మశ్రీ దక్కింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరితో పాటు మరో ముగ్గురు తెలుగువారు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తన ఇంటినే గ్రథాలయంగా చేసిన కూరెళ్ల విఠలాచార్య (భువనగిరి), శిల్పకళా పేరుపొందిన వేలు ఆనందాచారి (హైదరాబాద్), బంజారా భాషలో భగవద్గీత రచించిన కేతావత్ సోమ్లాల్ లకు కూడా పద్మశ్రీ అవార్డ్ లభించింది. కాగా పురస్కారాలకు ఎంపికైన వారు వచ్చే మార్చి- ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు.








Updated : 26 Jan 2024 7:37 AM IST
Tags:    
Next Story
Share it
Top