Home > సినిమా > Megastar Chiranjeevi : సీనియర్ హీరోయిన్లపై మనసు పారేసుకుంటున్న హీరోలు

Megastar Chiranjeevi : సీనియర్ హీరోయిన్లపై మనసు పారేసుకుంటున్న హీరోలు

Megastar Chiranjeevi  : సీనియర్ హీరోయిన్లపై మనసు పారేసుకుంటున్న హీరోలు
X

అక్కినేని నాగార్జున సంక్రాంతి బరిలో నిలిచి నా సామి రంగా మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. కుర్ర హీరోలతో సీనియర్ హీరోలు పోటీపడుతూ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చేతిలో నాలుగైదు సినిమాలు పెట్టుకుని ఒక్కొక్కటే విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో మూడు సినిమాలున్నాయి. అలాగే బాలయ్య చేతిలో రెండు ఉన్నాయి. వెంకీ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. నాగార్జున మాత్రం ఓ మూవీలో హీరోగా చేస్తూనే మరో మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ధనుష్- శేఖర్ కమ్ముల చిత్రంలో నాగార్జున కీ రోల్ పోషిస్తున్నాడు. ఇకపోతే సుబ్బు అనే కొత్త దర్శకుడితో నాగ్ సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ మూవీ కోసం సీనియర్ బ్యూటీ అయిన ప్రియమణిని నాగ్ బరిలోకి దింపనున్నాడు. మరోవైపు చిరంజీవి కూడా తన సినిమాలో త్రిషను తీసుకొస్తున్నారు. ఒకప్పుడు కుర్ర హీరోయిన్లతో నటించాలనుకున్న హీరోలు ఇప్పుడు సీనియర్ బ్యూటీలపై మనసు పారేసుకుంటున్నారు.

చిరు తన విశ్వంభర సినిమాలో త్రిషను ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు అదే బాటలో నాగ్ ప్రియమణిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. 14 ఏళ్ల క్రితం నాగ్‌తో రగడ మూవీలో ప్రియమణి ఆడిపాడింది. ఇప్పుడు నాగ్ సరసన రొమాన్స్ చేయడానికి సిద్ధంకానుంది. ప్రస్తుతం నాగ్ చేస్తున్న సినిమా సీరియస్ కోర్టు డ్రామాగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రియమణి ఉందా? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే మరి.


Updated : 11 Feb 2024 4:29 PM GMT
Tags:    
Next Story
Share it
Top