విజయ్ దేవరకొండపై గలీజ్ వీడియో.. ఏపీ యూట్యూబర్ అరెస్ట్
X
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై గలీజ్ వీడియోలు చేసిన యూట్యూబర్ కటకటాల పాలయ్యాడు. వ్యూస్ కోసం కక్కుర్తిపడి లబోదిబోమని మొత్తుకుంటున్నాడు. ఏపీలోని అనంతపురానికి చెందిన అతని పేరు వెంకట కిరణ్.. సీపీపోలిస్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కవ కనుక అతణ్ని టార్గెట్ చేసుకున్నాడు.
విజయ్ ఓ నటితో అసభ్యంగా ఉన్నట్టు వెంకట కిరణ్ ఓ వీడియోలను తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఈ వీడియోలకు అవాకులు చవాకులు జోడించాడు. అది కాస్తా విజయ్ టీమ్‌కు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ య్యూటూబ్ ఐడీ ద్వారా వివరాలు సేకరించిన హైదరాబాద్ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌పై ఐపీసీ 2590/2023 కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతని చానల్‌ను డిలీట్ చేయించr కౌన్సిలింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలబ్రిటీలపై ఎవరైనా ఇలాంటి వీడియో, వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కిరణ్ గతంలోనూ కొంతమంది హీరోహీరోయినట్లు అసంభ్యకర వీడియోలు చేసినన్టు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్.