Home > సినిమా > 'కోడ్ రామాయణ'..రామాయణానికి ముందు ఏం జరిగింది.?

'కోడ్ రామాయణ'..రామాయణానికి ముందు ఏం జరిగింది.?

కోడ్ రామాయణ..రామాయణానికి ముందు ఏం జరిగింది.?
X

ఇప్పటికే చాలా మంది తెలుగు చిత్ర దర్శకులు రామాయణం, మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాజాగా రామాయణ గాధను నేటితరం వారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‎తో రూపొందించిన విషయం తెలిసింది. ఇదే క్రమంలో ద్రవిడ భూమి యొక్క ఆత్మగౌరవం అనే నినాదంతో రచయిత సౌద అరుణ్ దర్శకత్వంతో కోడ్ రామాయణ పేరుతో మరో సినిమా త్వరలో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‎ను చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‎లోని ఫిల్మ్ ఛాంబర్ వేదికగా లాంచ్ చేసింది.



ఈ సందర్భంగా దర్శకుడు సౌద అరుణ్ మాట్లాడుతూ.." ద్రవిడ నేల గొప్పతనాన్ని ప్రపంచం ముందుంచాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సినిమా చేస్తున్నాం. కోడ్ రామాయణాన్ని మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాము. ఈ మూడు భాగాలు పూర్తి కావడానికి దాదాపు ఓ దశాబ్ద కాలం పట్టే అవకాశం ఉంది. ఈ చిత్రంలో 50 మంది నటీనటులు, టెక్నీషియన్లు పని చేశారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తాము. ఇప్పటీకీ సినిమాకు సంబంధించి మూడో వంతు పనులు మాత్రమే పూర్తి చేశాం. అందరి వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించడం లేదు. సంగీత, సాహిత్యాలకు నిలయమైన ద్రవిడ భూమి గడ్డపై జన్మించిన మేము జై శ్రీ రావణ అని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.




ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ.." కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం. అసలు ఏ సందేశం ఇచ్చేందుకు రామాయణం వచ్చిందో తెలపడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కోడ్ రామాయణాన్ని మూడు భాగాలుగా తీసుకువస్తున్నాం. మొదటి భాగం పూర్వ రామాయణం, ఆ తరువాత రావణ చరిత్ర, మూడవ భాగం ఉత్తర రామాయణంగా ఉంటుంది. మొదటి భాగం పూర్తైంది. రెండో భాగంలో రావణ పాత్రను ఎలివేట్ చేస్తున్నాము. మెగాస్టార్ చిరంజీవిని రావణుడి పాత్ర కోసం సంప్రదించాలని భావిస్తున్నాము" అని ఆయన తెలిపారు.





Updated : 13 Jun 2023 11:15 AM IST
Tags:    
Next Story
Share it
Top