Home > సినిమా > మిమిక్రీ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తా.. హీరో నిఖిల్పై ప్రొడ్యూసర్ సటైర్

మిమిక్రీ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తా.. హీరో నిఖిల్పై ప్రొడ్యూసర్ సటైర్

మిమిక్రీ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తా.. హీరో నిఖిల్పై ప్రొడ్యూసర్ సటైర్
X

కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్.. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేస్తున్న సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా మారిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి అందించిన ఈ కథను ఆయనే స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే స్పై రిలీజ్ విషయంలో హీరో నిఖిల్, ప్రొడ్యూసర్ రాజశేఖర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన కామెంట్లు దానికి ఆజ్యం పోస్తున్నాయి.

నిఖిల్ స్పై మూవీ జూన్ 29న రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు సందిగ్దత నెలకొంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో మూవీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలని నిఖిల్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున విడుదల వాయిదా వేయాలని కోరుతున్నట్టు వార్తలు వచ్చాయి. నిర్మాత మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

స్పై మూవీకి సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్, రీ రికార్డింగ్ ఇంకా పూర్తికానందున జూన్ 29న రిలీజ్ చేయడం లేదని నిఖిల్ మీడియాకు లీకులు ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో జూన్ 28న ప్రీమియర్ కు బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. తాజాగా నిఖిల్ లీకులపై ప్రొడ్యూసర్ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. రీరికార్డింగ్ ఇంకా పూర్తి కాలేదన్న ఆయన వ్యాఖ్యలపై సటైర్ వేశారు. అదేమైనా ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతా? మిమిక్రీ ఆర్టిస్టులతో డబ్బింగ్ చేయించి 29న స్పై మూవీ రిలీజ్ చేస్తామని చెప్పారని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద హీరో, ప్రొడ్యూసర్ల స్టేట్మెంట్లు ప్రేక్షకుల్ని కన్ఫూజన్ లో పడేశాయి.

Updated : 14 Jun 2023 2:55 PM IST
Tags:    
Next Story
Share it
Top