Home > సినిమా > Colors Swathi : విడాకుల ప్రశ్నకు కలర్స్ స్వాతి ఆన్సర్ ఇదే

Colors Swathi : విడాకుల ప్రశ్నకు కలర్స్ స్వాతి ఆన్సర్ ఇదే

Colors Swathi  : విడాకుల ప్రశ్నకు కలర్స్ స్వాతి ఆన్సర్ ఇదే
X

గత కొంతకాలంగా నటి కలర్స్ స్వాతి విడాకులకు సంబంధించిన విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. (Colors Swathi Divorce..)స్వాతిపై ఏదో ఒక న్యూస్ నిత్యం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. అయితే డివోర్స్ న్యూస్‎పై ఇటు స్వాతి కానీ, ఆమె భర్తగానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా లేటెస్టుగా మారోసారి స్వాతి డివోర్స్ అంశం తెరపైకి వచ్చింది. స్వాతి నటించిన "మంత్ ఆఫ్ మధు" సినిమా ప్రెస్ మీట్‎లో ఓ రిపోర్టర్ మీరు డివోర్స్ తీసుకున్నారా అని ప్రశ్నించగా స్వాతి నేను చెప్పను అంటూ అతనిపై సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

2018లో కలర్స్ స్వాతి వికాస్ వాసును పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ పెళ్లి తర్వాత ఫారెన్‎లో సెటిల్ అయ్యారు. పెళ్లి తర్వాత తన పర్సనల్ విషయాల గురించి స్వాతి ఎప్పుడూ చెప్పింది లేదు. రెండు మూడుసార్లు మాత్రమే ఆమె మీడియా ముందుకు వచ్చింది. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ స్వాతి సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇస్తుండటంతో

మీడియా ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే స్వాతి తన భర్తకు విడాకులు ఇచ్చిందని, అందుకే మళ్ళీ తన కెరీర్‎పై దృష్టిపెట్టిందని ఇండస్ట్రీలో రూమర్స్ వస్తున్నాయి.

స్వాతి నటించిన "మంత్ ఆఫ్ మధు" సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. నవీన్ చంద్రకు జోడీగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మీడియాతో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్‎లో విడాకులకు సంబంధించిన ఓ ప్రశ్న స్వాతికి ఎదురైంది. దీంతో స్వాతి.."ఈ ప్రోగ్రామ్‎కి మీరు అడిగిన ప్రశ్నకు అసలు సంబంధమే లేదు. ఈ ప్రశ్న అనవసరం అని నా ఒపీనియన్. నా విడాకులతో మీకేం పని. నేను ఆన్సర్ చెప్పను" అని ఫైర్ అయ్యింది.

కొంతకాలంగా స్వాతి తన భర్తతో దూరంగా ఉంటోంది. తన పర్సనల్ ఇంస్టాగ్రామ్‎లోనూ మ్యారేజ్ ఫోటోలు కనిపించడం లేదు. దీంతో స్వాతి డివోర్స్ తీసుకుందని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇదే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు మీడియా ప్రశ్నించగా ఆమె సీరియస్ అయ్యింది.




Updated : 26 Sept 2023 5:51 PM IST
Tags:    
Next Story
Share it
Top