Home > సినిమా > కమెడియన్ యాదమ్మ రాజుకు యాక్సిడెంట్.. దారుణమైన స్థితిలో..!

కమెడియన్ యాదమ్మ రాజుకు యాక్సిడెంట్.. దారుణమైన స్థితిలో..!

కమెడియన్ యాదమ్మ రాజుకు యాక్సిడెంట్.. దారుణమైన స్థితిలో..!
X

జబర్దస్థ్ కమెడియన్ యాదమ్మ రాజు గురించి అందరికీ తెలిసిందే. అమాయకంగా ఉంటూ తనదైన యాసతో అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సినిమాల్లో ఛాన్స్ లు కొడుతున్నాడు. ఈ క్రమంలో యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయిందనే వార్త అతని ఫ్యాన్స్ ను అయోమయానికి గురిచేసింది. హాస్పిటల్ లో కదల్లేని పరిస్థితిలో కాలుకు కట్టుకట్టుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యాదమ్మ రాజుకు అతని భార్య స్టెల్లా హెల్ప్ చేస్తూ.. పైకి లేపుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో స్టెల్లా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. యాదమ్మ రాజుకు హెల్ప్ చేస్తూ కనిపించింది. ఇది చూసిన యాదమ్మ రాజు ఫ్యాన్స్.. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరికొందరు స్టెల్లా చేసిన పనికి తిడుతున్నారు. భర్త హాస్పిటల్ లో ఉంటే.. అతని పరిస్థితిని రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంపై మండిపడుతున్నారు.

Updated : 24 July 2023 9:01 PM IST
Tags:    
Next Story
Share it
Top