Home > సినిమా > Ranbir Kapoor:హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ రణబీ‌ర్‌పై ఫిర్యాదు!

Ranbir Kapoor:హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ రణబీ‌ర్‌పై ఫిర్యాదు!

Ranbir Kapoor:హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ రణబీ‌ర్‌పై ఫిర్యాదు!
X

క్రిస్టమస్ సెలబ్రేషన్ వీడియోలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్,అతని కుటుంబ సభ్యులపై ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. బాంబే హైకోర్టు లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా సంజయ్ దీనానాథ్ తివారీ రణబీర్‌పై ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో రణబీర్‌ ‘జై మాతా ది’ అని అరుస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు. ఈ వీడియో కొంతమందికి ఏమాత్రం నచ్చలేదు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు ఈ యనిమల్ హీరో. ఈ వీడియోపై దుమారం రేగుతుండగా.. ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని సమాచారం.

బాంబే హైకోర్టు లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా సంజయ్ దీనానాథ్ తివారీ రణబీర్‌పై ఫిర్యాదు చేశారు. రణ్‌బీర్ కపూర్ ‘జై మాతా ది’ అని చెప్పగానే, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా జై మాతా ది అని అన్నట్టు కంప్లైంట్‌లో పేర్కొన్నారు లాయర్లు. రణబీర్ కపూర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. మతపరమైన మనోభావాలు దెబ్బతిశారని, హిందూవుల మనోభావాలను కించపరిచే లక్ష్యంతో ఈ వీడియోను రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Updated : 28 Dec 2023 10:51 AM IST
Tags:    
Next Story
Share it
Top