Home > సినిమా > జెన్యూన్ పదం వాడిన బన్నీ.. అవమానించేందుకే అంటున్న చెర్రీ ఫ్యాన్స్

జెన్యూన్ పదం వాడిన బన్నీ.. అవమానించేందుకే అంటున్న చెర్రీ ఫ్యాన్స్

జెన్యూన్ పదం వాడిన బన్నీ.. అవమానించేందుకే అంటున్న చెర్రీ ఫ్యాన్స్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో చరిత్ర సృష్టించారు. పుష్ప అంటే ఫైర్ అంటూ పాన్‌ ఇండియా రేంజ్లో సత్తా చాటిన అల్లు అర్జున్‌.. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. సుకుమార్‌ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్పలో పుష్పరాజ్‌గా బన్నీ నటన, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌ అన్నీ సినీ ప్రేక్షకులని సమ్మోహన పరిచాయి . చిన్నా, పెద్దా అంతా తగ్గేదేలే అంటూ హోరెత్తించారు. బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించడమే కాదు, రికార్డులను సైతం ఈ పుష్పరాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకుని తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశాడు.

బన్నీ సాధించిన విజయంతో అల్లు ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి హీరోలకు కూడా రాని అవార్డు దక్కిందని సంబురబడుతున్నారు . జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ బావా అంటూ ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ అందాయి. అయితే రాం చరణ్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా బన్నీకి విషెష్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.




ఇదిలా ఉంటే బన్నీ ఇస్తున్న రిప్లైలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌కు జెన్యూన్ విషెస్, సాయి ధరమ్ తేజ్‌కు జెన్యూన్ కజిన్ అంటూ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ జెన్యూన్ కజిన్ అయితే.. మిగతా వాళ్లు ఏంటని, అసలు జెన్యూన్ పదం ఎందుకు వాడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్‌కు పరోక్షంగా కౌంటర్లు వేస్తున్నావా అని మరికొందరు అడుగుతున్నారు. సాయి ధరమ్ తేజ్ను జెన్యూన్ కజిన్ అనడం చెర్రీని అవమానించడమేనని రాం చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.




Updated : 25 Aug 2023 3:07 PM IST
Tags:    
Next Story
Share it
Top