Home > సినిమా > రజాకార్ మూవీ పోస్టర్‌పై రచ్చరచ్చ

రజాకార్ మూవీ పోస్టర్‌పై రచ్చరచ్చ

రజాకార్ మూవీ పోస్టర్‌పై రచ్చరచ్చ
X

నిజాం పాలనలో సాగిన రజకార్ల ఆగడాలపై రూపొందుతున్న తెలుగు చిత్రం ‘రజాకార్’ విడుదల కాకముందే కాక రేపుతోంది. ఈ మూవీ పోస్టర్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. ముస్లింలు, లౌకికవాదులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఈ సినిమాను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ‘కేరళ స్టోరీ’, ‘కశ్మీర్ ఫైల్స్’ తరహాలు బీజేపీ ఈ సినిమాతోనూ మతసామరస్యాన్ని దెబ్బతీసి ఓట్లు దండుకోవాలని చూస్తోందని మండిపడుతున్నారు. అయితే సినిమా విడుదల కాకముందే ఇలా విమర్శించడం సరికాదనే వాదనలూ వినిపిస్తున్నారు. ఈ సినిమా అభ్యంతరకరంగా ఉంటే దీనికి పోటీగా మరో సినిమా తీసుకోవాలి తప్ప నిషేధిండం సరికాదని అంటున్నారు.

‘రజాకార్ – ద సైలెంట్ జినోసైడ్ ఇన్ హైదరాబాద్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ పోస్టర్లో తుపాకీ కత్తి మొనపై ఒక బ్రాహ్మణుడి శవం నెత్తురోడుతూ ఉంది. బ్యాగ్రౌండులో రజాకార్లు నిల్చుని ఉన్నారు. రజాకార్లు హిందువులను దారుణంగా హతమార్చారని చెప్పడం ఈ పోస్టర్ ఉద్దేశం. ఈ సినిమాను బీజేపీ నేత గూడూరు నారాయణరావు నిర్మిస్తుండగా యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం జరిగిన పోస్టర్ ఆవిష్కరరణకు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. బండి ఎప్పట్లాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకి రావాలనే ఈ సినిమా తీశారని, కొందరు నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలమని వక్రకరిస్తున్నారని మండిపడ్డారు. కాగా రజాకార్లపై ఇది తొలి సినిమా కాదు. 2015లో మరాఠీలో ఇదే పేరుతో ఓ చిత్రం వచ్చింది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన ఓ మరాఠా గ్రామంలో రజాకార్ల దుర్మార్గాలను ఈ చిత్రంలో చూపించారు.

Updated : 17 July 2023 10:00 AM IST
Tags:    
Next Story
Share it
Top