Home > సినిమా > విజయ్‎ దేవరకొండకి దిమ్మతిరిగే కౌంటర్ ..

విజయ్‎ దేవరకొండకి దిమ్మతిరిగే కౌంటర్ ..

విజయ్‎ దేవరకొండకి దిమ్మతిరిగే కౌంటర్ ..
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ దాదాపు ఐదేళ్ల తర్వాత ఖుషి సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా హిట్టుతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు రౌడీ బాయ్. ఈ ఆనందంతో ప్రేక్షకులకు తనవంతుగా హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఖుషి సినిమాకి వచ్చిన రెమ్యూనిరేషన్‎లో కోటి రూపాయలను పేద కుటుంబాలకు అందించనున్నట్టు తాజాగా ప్రకటించి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. అయితే విజయ్ కోటి సాయం చేయడానికి ముందుకు రావడంతో .. నీ వళ్ళ నష్టపోయిన మమ్మల్ని ఆదుకోవాలని .. ఓ నిర్మాత విజయ్‏కి కౌంటర్‎గా ట్వీట్ చేశాడు . మీరు నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా వలన నష్టపోయిన వారిని కూడా మీరు ఆదుకోవాలంటూ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారింది.





అభిషేక్ పిక్చర్స్ సంస్థ.. "డియర్ విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ డిస్ట్రిబ్యూషన్‌లో మేము ఎనిమిది కోట్ల రూపాయలు నష్టపోయాం . దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు వంద కుటుంబాలకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నారు. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీలను కాపాడాలని కోరుతున్నాం" అని ట్వీట్ చేసారు. దీనికి విజయ్‎ను ట్యాగ్ చేస్తూ మానవత్వం, ప్రేమ అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. 2020లో విడుదలైన 'వరల్డ్ ఫెమస్ లవర్ ' డిజాస్టర్ ఫలితం అందుకుంది . దీని తర్వాతనే విజయ్ ఇక లవ్ స్టోరీలు చేయనని ప్రకటించాడు . ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది .అప్పటితో అది ముగిసింది. అయితే ఇప్పుడు విజయ్‏ని పనిగట్టుకొని వాళ్ళు డబ్బులు అడగడం వెనుక పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది .

అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్‎పై కూడా పలు విమర్శలు వస్తున్నాయి.. బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయ్యుంటే ఇలా చేసేవారా.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమా నష్టాలతో హీరోకి సంబంధం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. సినిమా ప్లాప్ అయినప్పుడు డబ్బులు వెనక్కి ఇవ్వడం ఆయా హీరోలు, నిర్మాతల ఇష్టం . లాభాలు వచ్చినప్పుడు హీరోలకు షేర్ ఇవ్వరు కాబట్టి, నష్టాలు వచ్చినప్పుడు కూడా అడిగే హక్కు ఉండదు. అయితే కొందరు పెద్ద మనసుతో నష్టాలని భరిస్తారు. అయితే అభిషేక్ నామ ఇలా అడగడం వెనుక వేరే కారణం ఉందని అంటున్నారు.. వాల్డ్ ఫెమస్ లవర్ తర్వాత తమ బ్యానర్‏కి ఒక సినిమా చేసి పెట్టండి అని అభిషేక్ నామా విజయ్‎కి ప్రపోజల్ పెట్టారని టాక్ . అయితే విజయ్ టీం ఇప్పట్లో సినిమా చేయడం కష్టం అని క్లారిటీ ఇచ్చారట. ఆ తర్వాత విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ కోసం ఖుషి సినిమా చేశారు. తాము అడిగితె చేయకుండా వేరే బ్యానర్ కి చేయడం సినిమా హిట్ కావడంతో ఇలా విజయ్‎పై కామెంట్స్ చేసినట్టు సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది.




Updated : 6 Sept 2023 1:12 PM IST
Tags:    
Next Story
Share it
Top