Home > సినిమా > CPI Narayana : సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉంటే ఏమనాలి.? సీపీఐ నారాయణ

CPI Narayana : సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉంటే ఏమనాలి.? సీపీఐ నారాయణ

CPI Narayana  : సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉంటే ఏమనాలి.? సీపీఐ నారాయణ
X

బిగ్ బాస్ షోపై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... బిగ్ బాస్ బ్రోతల్ హౌస్ అన్న వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. తాను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్సీ చేయాలని భావించను అన్నారు. కానీ బిగ్ బాస్ అనైతికంగా అనిపించిందన్నారు. అందుకే ఆ షోను పలుమార్లు విమర్శించానన్నారు. ఏ సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉండటాన్ని ఏమనాలి అని ఫైర్ అయ్యారు.

ఇక, తెలంగాణ పాలిటిక్స్ పై నారాయణ స్పందిస్తూ.. "బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్లతో అన్ని రోజులు కలిసి ఉంటాం. చట్టసభల్లో ఉండాలంటే.. ఒంటరిగా పోటీ చేయడానికి సాధ్యంకావడం లేదు. సర్దుబాటు ధోరణిలోనే రాజకీయ అవగాహన ఉంటుంది. లెఫ్ట్‌ పార్టీల ప్రస్తుత పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం. పార్టీ విడిపోకుండా ఉంటే.. మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలిసిపోదామని సీపీఐ పెడుతున్న ప్రతిపాదనకు సీపీఎం అంగీకరించడంలేదు. తమ పార్టీతో ఏం సంబంధంలేని వారికి ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్లు అమ్ముకుంది. కోటి రూపాయలా, 10 లక్షలా అనేది నిరూపించలేను కానీ.. డబ్బులకు టికెట్లు అమ్ముకున్న మాట వాస్తవం. బీఆర్‌ఎస్‌కు బీజేపీతో రాజకీయ అవగాహన ఉంది" అని అన్నారు.




Updated : 21 Nov 2023 6:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top