Home > సినిమా > క్రేజీ న్యూస్.. లోకేష్ కనగరాజ్‌తో రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ

క్రేజీ న్యూస్.. లోకేష్ కనగరాజ్‌తో రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ

క్రేజీ న్యూస్.. లోకేష్ కనగరాజ్‌తో రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ
X

సినీ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్స్ మూవీస్‌తో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాపులర్ అయ్యారు. కమల్ హాసన్, విజయ్ వంటి స్టార్ హీరోలతో మూవీస్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. హీరోలకు పోటీనిచ్చేలా సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్‌ను లోకేష్ సొంతం చేసుకున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాంటి లోకేష్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ క్రేజీ న్యూస్‌తో రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇప్పటికే స్టార్ హీరోలంతా లోకేష్ వైపే చూస్తున్నారు. అటు టాలీవుడ్ హీరోలు సైతం లోకేష్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్‌తో లోకేష్ సినిమా చేస్తున్నారని తెలియడంతో అభిమానులు ఎగిరి గంతేసినంత పని చేస్తున్నారట. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే లోకేష్‌తో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

కేజీఎఫ్ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమాను యష్ అనౌన్స్ చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత యష్ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. 'టాక్సిక్' అనే మూవీతో యష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ 'టాక్సిక్' మూవీ నిర్మాతలే రామ్ చరణ్, లోకేష్ కనగరాజ్ సినిమాను చేయనున్నారట. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ ఉంటుందని, ఈ మూవీ స్టోరీని ఎవ్వరూ ఊహించలేరని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది.

లోకేష్ కనగరాజ్ మూవీల్లో సాధారణంగా హీరోయిజం అనేది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయనున్నాడు. ఇక ఆ మూవీ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మూవీలో రామ్ చరణ్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఏవిధంగా ఉంటాయో ఊహించుకోవడానికే సరిపోదు. అటువంటి మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతటి భారీ అంచనాలతో వస్తోన్న లోకేష్ కనగరాజ్- రామ్ చరణ్ మూవీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Updated : 14 March 2024 5:26 PM IST
Tags:    
Next Story
Share it
Top