OG : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'ఓజీ' రిలీజ్ డేట్ ఇదే
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. బ్రో మూవీ తర్వాత పవన్ సినిమా ఇంతవరకూ ఏదీ విడుదల కాలేదు.
అభిమానులంతా పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. థియేటర్లో తమ హీరో సినిమా కోసం వెయ్యికళ్లతో చూస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ మూవీ మేకర్స్ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఓ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ చుట్టూ కథ సాగేలా తెలుస్తోంది.
ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన మూవీపై క్రేజీ అప్‌డేట్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.