షాకింగ్..మహేశ్ బాబు కూతురు పేరుతో మోసం
X
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అటువంటి మహేశ్‌కు తగినట్లుగా ఆయన ఫ్యామిలీ కూడా ఉంటుంది. అయితే మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని పేరుతో కొందరు మోసాలకు పాల్పడ్డారు. సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ లింక్స్ పంపుతున్నట్లుగా మహేశ్ బాబు టీమ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో మహేశ్ టీమ్ ఆ మోసాలకు సంబంధించి పోలీసులను ఆశ్రయించింది. మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు మహేశ్ బాబు టీమ్ ఫిర్యాదు కూడా చేసింది.
ఈ సందర్భంగా సితార పేరుతోనే కాకుండా సినీ తారల పేరుపై వచ్చే లింకుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంపై మహేశ్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఇన్‌స్టాలో నమ్రత ఓ నోట్‌ను రిలీజ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఫోటోలు వాడి కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని, ఆ అకౌంట్లో ట్రేడింగ్, పెట్టుబడికి సంబంధించిన లింక్‌లు పెడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
ఫేక్ అకౌంట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని నమ్రత సూచించారు. మహేశ్ బాబు టీమ్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారని తెలిపారు. పోలీసులు ఆ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని విడిచిపెట్టరని, అటువంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నమ్రత్త తెలియజేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.