Dadasaheb Phalke Award 2024 : ఉత్తమ నటుడు షారుఖ్, ఉత్తమ నటి నయనతార
X
భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు' ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వం వహించిన 'యానిమల్' గతేడాది డిసెంబర్(2023 )లో విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. విశేష ప్రేక్షాకదరణ పొందిన ఈ సినిమా.. ఉత్తమ దర్శకుల కేటగిరిలో మొదటి స్థానంలో నిలిచింది. మంగళవారం రాత్రి ముంబయిలో పలువురు సినీ తారల సమక్షంలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి.. అవార్డులను ప్రదానం చేశారు.ఈ అవార్డుల్లో ‘ యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ వంగాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఇక మరో సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ దర్శకుడిగా తెరకెక్కిన జవాన్ సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, నయనతార ఉత్తమ నటిగా నిలిచారు. యానిమల్ సినిమాలో కీలకపాత్రలో నటించిన బాబీ డియోల్ కూడా ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్)గా నిలిచాడు.
క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్ ( సామ్ బహదూర్)
ఉత్తమ గీత రచయిత - జావేద్ అక్తర్ ( నిక్లే ది కభి హమ్ ఘర్‌సే ధున్కీ)
ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్ రవిచందర్
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - వరుణ్ జైన్
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ( ఫీమేల్) - శిల్పా రావు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ - యేసుదాసు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ
క్రిటిక్స్ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్)