Home > సినిమా > Rana Daggubati Apologises : బాలీవుడ్ హీరోయిన్కు సారీ చెప్పిన రానా.. ఏమైందంటే..?

Rana Daggubati Apologises : బాలీవుడ్ హీరోయిన్కు సారీ చెప్పిన రానా.. ఏమైందంటే..?

Rana Daggubati Apologises : బాలీవుడ్ హీరోయిన్కు సారీ చెప్పిన రానా.. ఏమైందంటే..?
X

దగ్గుబాటి రానా.. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలిలో బల్లాలదేవా పాత్రతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అరణ్య, విరాట పర్వం వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కాగా ఓ మూవీ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది నెట్టింట చర్చనీయాంశంగా మారడంతో రానా స్పందించారు. సదరు హీరోయిన్కు సారీ చెప్పారు.

దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన రానా ఓ బాలీవుడ్ హీరోయిన్ బిహేవియర్పై విమర్శలు గుప్పించాడు. ‘‘నేను దుల్కర్ నటించిన ఓ మూవీ సినిమా షూటింగ్కు వెళ్లా.. సీన్ మధ్యలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షాపింగ్ గురించి వాళ్ళ భర్తతో ఫోన్లో మాట్లాడుతుంది. ఆమె నన్ను చూసి కలవడానికి వస్తుంటే షాట్ రెడీగా ఉంది వెళ్ళండి అని పంపించాను. షాట్ గ్యాప్లో మళ్ళీ ఇంకో ఫోన్ కోసం వెళ్ళింది. నాకు కోపం వచ్చి చేతిలో ఉన్న బాటిల్ను నేలకేసి కొట్టా. కానీ దుల్కర్ మాత్రం అక్కడే ఓపికతో నిలబడి యాక్ట్ చేశాడు’’ అని రానా చెప్పుకొచ్చాడు.

దుల్కర్ బాలీవుడ్లో సోనమ్ కపూర్తో కలిసి జోయా ఫ్యాక్టర్ అనే మూవీలో నటించారు. దీంతో రానా చెప్పిన హీరోయిన్ సోనమ్ అంటూ నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోశారు. దీనిపై రానా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘నా వ్యాఖ్యల వల్ల సోనం కపూర్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంతో ఇబ్బంది పడ్డాను. ఇది సింపుల్గా తీసుకోవాల్సిన విషయం. నా కామెంట్లను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోనంకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని ట్వీట్ చేశారు. మరి ఇక్కడితో ఈ వివాదానికి తెరపడుతోందేమో చూడాలి.

Updated : 15 Aug 2023 3:33 PM IST
Tags:    
Next Story
Share it
Top