Home > సినిమా > Bigg Boss 7 Elimination : యావర్ ఎఫెక్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమే..!

Bigg Boss 7 Elimination : యావర్ ఎఫెక్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమే..!

Bigg Boss 7 Elimination : యావర్ ఎఫెక్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమే..!
X

ఊహించినట్లే ఈ సారి ఉల్టాపల్టా సీజన్ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. మొదటి రెండు వారాలు కాస్త చప్పగా సాగినా.. థర్డ్ వీక్ లో అసలైన మజా మొదలైంది. ట్విస్ట్ లు, సర్ ప్రైజ్ లతో షో ఆసక్తిగా మారుతోంది. టాస్క్ లు, నామినేషన్లు, ఎలిమినేషన్లు, డ్రామాల మధ్య ఆడియన్స్ కు కావాల్సినంత మాజా పంచుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈవారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రియాంక జైన్, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, దామిని, శుభ శ్రీ రాయగురు హౌస్ నుంచి ఎలిమినేట్ వారి అయ్యే లిస్టులో ఉన్నారు. వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా చూస్తే ఈ వారం దామిని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఒకవేళ దామిని ఎలిమినేేట్ అయితే దాని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. రెండు వారాల పాటు కామ్ గా, ఏ రచ్చ లేకుండా, వివాదాలకు దూరంగా ఉన్న దామిని.. ఎక్కువగా వంట గదికే పరిమితమైంది. అంతేకాదు.. హౌస్ యాక్టివిటీల్లో ఎక్కువగా కనిపించలేదు. ఇక ఇప్పటివరకు జరిగిన ఆరు సీజన్స్ లో వంట రూంకు పరిమింతం అయినవాళ్లే త్వరగా ఎలిమినేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దామిని విషయంలో ఇదే జరిగిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ లో దామికి కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే పడ్డట్లు సమాచారం. దామినికి నెగిటివిటీ పెరగడానికి.. హౌస్ యాక్టివిటీల్లో పాల్గొనకుండా, కిచెన్ కే పరిమితం అవడం ఒక కారణం అయితే.. తాజాగా ఓ టాస్క్ లో దామిని చూపించిన తీరుకు ఆడియన్స్ ఛీ కొట్టారు. అదే దామినికి పెద్ద మైనస్ పాయింట్ అయింది.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో దామిని యావర్ నోట్లో పేడ కొట్టడం, హింసించడంతో ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది. కంటెండర్ టాస్కుల్లో ఆమెకు ఎక్కువ కంటెంట్ ఇచ్చే అవకాశం లభించలేదు. దీంతో స్క్రీన్ స్పేస్ తగ్గడంతో ఆమెకు ఎక్కువ ఓట్లు పడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్ నుంచి ప్రిన్స్ యావర్ ఎవరిని నామినేట్ చేస్తే వారు హౌస్ నుంచి బయటకు వస్తున్నారన్న రూమర్ సోషల్ మీడియా జోరుగా వినిపిస్తోంది. అయితే మొదటి వారం ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్ ను యావర్ నామినేట్ చేయలేదు. రెండో వారం ఆయన నామినేట్ చేసిన షకీలా హౌస్ నుంచి బయటకు వచ్చింది. తాజాగా థర్డ్ వీక్ లో యావర్ దామినిని నామినేట్ చేయడంతో ఆమె డేంజర్ జోన్ లోకి వచ్చింది.

Updated : 23 Sept 2023 6:37 PM IST
Tags:    
Next Story
Share it
Top