Bigg Boss Buzzz: శివాజి పెద్ద జిత్తులమారి.. దామిని షాకింగ్ కామెంట్స్
X
‘బిగ్ బాస్’ సీజన్-7 (Bigg Boss Telugu Season 7)లో ఆదివారం దామిని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున హౌస్‌లో ఉన్నవారికి సలహాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో దామిని.. హౌస్‌లో శివాజీ తీరును ప్రస్తావించింది. దీంతో శివాజీ తనదైన శైలిలో స్పందించాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన దామినీ ‘బిగ్ బాస్ బజ్’లో మాట్లాడుతూ.. శివాజీ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పింది. శివాజీపై హౌస్ లో నే మొదలైన ఈ రచ్చ.. బయటకు వచ్చిన తర్వాత కూడా అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది
హౌస్ నుంచి బయటకు వచ్చిన దామినిని.. బెలూన్ పగలగొట్టి, కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అడిగారు నాగ్. ఈ సందర్భంగా ఆమె శివాజీతో మాట్లాడుతూ.. ‘‘మీరు నన్ను సేఫ్ గేమ్ ఆడావని అంటున్నారు. కానీ, ఇక్కడ ప్రోమో చూసిన తర్వాత నాకు అలా అనిపించలేదు’’ అని అంది. ఇందుకు శివాజీ స్పందిస్తూ.. ‘‘నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనలేదు. నీ గేమ్ నువ్వు ఆడలేదని అన్నాను. ఫస్ట్ వీక్ మాత్రమే గేమ్ ఆడావు. నీ ఫ్రెండ్స్‌ను అడుగు బయటకు వెళ్లిన తర్వాత. నేను అన్నది తప్పయితే తీసుకుంటాను’’ అని అన్నాడు. అలాగే హౌస్‌లో మీరు ఫేవరిజమ్ చేస్తున్నారని దామిని పేర్కొంది. ఇందుకు శివాజీ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు. ఇంటికెళ్లిన తర్వాత చూడు తెలుస్తుంది’’ అని సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత ‘బిగ్ బాస్ బజ్’లో పాల్గొన్న దామిని... గీతూ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది. తానస్సలు హౌస్ నుంచి బయటకు వెళ్తానని కూడా ఊహించలేదని చెప్పింది. ప్రిన్స్ ముఖంపై పేడ ఎందుకు కొట్టావని అడగ్గా... అదొక టాస్క్ అని.. దానిని అంతవరకే చూడాలని చెప్పింది. శివాజీ గురించి అడిగినప్పడు.. ఆయన చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని పేర్కొంది. పల్లవి ప్రశాంత్ గురించి అడిగినప్పుడు.. అసలు తాను అతడి గురించి మాట్లాడదలచుకోలేదని పేర్కొంది.