Home > సినిమా > ఇంటివాడైన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

ఇంటివాడైన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

ఇంటివాడైన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల
X

తొలి సినిమాతోనే బాక్సాఫీస్‌ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ ఒక్క సినిమాతోనే సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పిన శ్రీకాంత్ ఓ ఇంటివాడయ్యాడు. కరీంనగర్ బొమ్మకల్లోని వి కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహమహోత్సవంలో సౌమ్య కృష్ణ మెడలో మూడు ముళ్లు వేశాడు.

శ్రీకాంత్ పెళ్లికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే నాని వెడ్డింగ్‌ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడు. పూణేలో ఓ యాడ్‌ ఫిల్మ్‌ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా పెళ్లికి రాలేకపోయాడని సమాచారం. అయితే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శ్రీకాంత్‌ ఓదెలకు నాని శుభాకాంక్షలు చెప్పాడు.

సింగరేణి బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ నేపథ్యంలో తెరకెక్కించిన దసరా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమా గ్రాండ్ సక్సెస్‌ కావడంతో శ్రీకాంత్ అగ్ర దర్శక నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఓ టాప్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.




Updated : 31 May 2023 6:44 PM IST
Tags:    
Next Story
Share it
Top