తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..ఆ ఫోటోలు వైరల్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తల్లికాబోతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లండన్‌లో బాప్టా 2024 అవార్డుల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం వేదికపై బంగారు రంగు చీరలో దీపికా పదుకొనే మెరిశారు. వేదికపై ఆమెను చూసిన వారంతా కచ్చితంగా దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మరిన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.
దీపికా పదుకునే స్టేజీపై బంగారు, వెండి రంగుల కలయికతో ఉన్న చీరలో కనిపించారు. ఆ సందర్భంగా ఆమె చీర కొంగుతో తన బేబీ బంప్‌ను దాచుకోవడానికి ప్రయత్నించారంటూ అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. దీపికా రెడ్ కార్పెట్‌పై నడుస్తూ చీర పట్టుకున్న విధానం చూస్తే ఆమె ప్రస్తుతం గర్భవతి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దని కామెంట్స్ చేస్తున్నారు.
2018లో దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దీపికా టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్‌తో కల్కి మూవీలో నటిస్తోంది. ఇక హిందీలో అయితే సింగమ్ రిటర్న్స్ అనే సినిమాలో చేస్తోంది. ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ వస్తున్న వార్తలపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వార్తలపై దీపికా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఆమెకు సంబంధించిన పోస్టులు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.