Deepika Padukone : తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే శుభవార్త చెప్పారు. తాను తల్లికాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దీపికా గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విషయంపై ఆమె ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తమ ఫస్ట్ చైల్డ్‌కి సంబంధించి రణ్‌వీర్ సింగ్, దీపికా తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్టులు పెట్టారు.
చిన్నారి దుస్తులు, వస్తువులతో డిజైన్ చేసిన ఓ పోస్ట్ ద్వారా దీపికా తన ప్రెగ్నెన్సీ గురించి తెలిపారు. తనకు పుట్టబోయే బిడ్డ ఏ నెలలో జన్మిస్తుందనే విషయాన్ని కూడా తన పోస్ట్‌లో వెల్లడించారు. 2024 సెప్టెంబర్ నెలలో తమ బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం దీపికా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ తారలు దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
2018లో దీపికా, రణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి వేడుగా జరిగింది. పెళ్లైన ఆరేళ్లకి ఈ జంట తల్లిదండ్రులు కాబోతుండటంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే ఈ మధ్యనే దీపికా పదుకొనే పఠాన్, జవాన్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రభాస్ సరసన ప్రస్తుతం 'కల్కి2898ఏడీ' సినిమా చేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మే 9వ తేదిన విడుదల కానుంది.