Home > సినిమా > Devara : ఎన్టీఆర్ డేట్ లో విజయ్ దేవరకొండ

Devara : ఎన్టీఆర్ డేట్ లో విజయ్ దేవరకొండ

Devara : ఎన్టీఆర్ డేట్ లో విజయ్ దేవరకొండ
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా దేవర 1. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. కోస్టల్ కారిడార్ లో జరిగే యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా రూపొందుతోన్న దేవరను ఏప్రిల్ 5న విడుదల చేస్తాం అని గతంలో ప్రకటించారు. అయితే ఈ డేట్ మారబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. యస్.. ముఖ్యంగా దిల్ రాజు లాంటి నిర్మాత ఆ డేట్ మారుతుందనే నమ్మకంతో ఉండటంతో చాలామంది అది నిజమే అని భావిస్తున్నారు. ఇదే జరిగితే దేవర డేట్ లో వచ్చేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఫ్యామిలీస్టార్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. బట్ షూటింగ్ పూర్తి కాలేదని వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాతి వారం ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవర విడులద కానుంది. అయితే దేవర వాయిదా పడితే ఏప్రిల్ 5నే ఫ్యామిలీ స్టార్ ను విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. మరి దిల్ రాజు లాంటి నిర్మాత ఏ సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకోడు. అందుకే దేవర వాయిదా పడుతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే విశేషం ఏంటంటే.. ఒకవేళ దేవర అదే డేట్ కు వచ్చే అవకాశం ఉంటే.. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి దిల్ రాజు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నాడు. దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీస్ వాళ్లు కూడా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం చూస్తున్నారు. ఒకవేళ దిల్ రాజుకు ఆ ఛాన్స్ వచ్చి.. దేవర పోస్ట్ పోన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ కు బిగ్ రిలీజ్ డేట్ అవుతుంది. ఆ మేరకు విజయ్ దేవరకొండకు ఓ భారీ ఓపెనింగ్ వస్తుంది. లేదూ దేవర ఏప్రిల్ 5నే విడుదలైతే విజయ్ ఫ్యామిలీ స్టార్ మార్చి 28న వస్తుంది. ఒక్క వారంలోనే మాగ్జిమం వసూళ్లు రాబట్టుకోవాల్సిన సిట్యుయేషన్ లో ఉంటుంది.సో.. ఈ మేరకు దిల్ రాజు మరోసారి ఏదైనా చక్రం తిప్పుతాడేమో చూడాలి.

Updated : 21 Jan 2024 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top