NTR Devara : సమ్మర్ కు దేవర రావడం కష్టమే..
X
డైరెక్టర్ ఒకటి తలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ మరోటి తలిచాడు అనే సామెత ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ వినిపిస్తుంది. నిజానికి ఇవి వినిపించకూడదు. విన్నారూ అంటే.. అవుట్ పుట్ పై ప్రభావం పడిందని అర్థం. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకుంటోన్న దేవర విషయంలో ఇదే వినిపిస్తోంది.అందుకే దేవర పోస్ట్ పోన్ కావడం ఖాయం అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే కాక మరో విషయంలోనూ దేవరకు పెద్ద షాక్ తగలబోతోందంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఐదేళ్లలో చేసింది రెండు సినిమాలే. ఈ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి దూకుడు పెంచాడు. కానీ అతని దూకుడును మ్యాచ్ చేసేలా ఈ సినిమా అవుట్ పుట్ రావడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. అసలు దేవర వాయిదా పడుతుందనే వార్తలు ఎందుకు వచ్చాయి..? వాటికి బలం ఏంటీ..?
దేవర.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా. జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తోన్న ఈ మూవీపై ఎన్టీఆర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియన్ హీరో ఇమేజ్ ను ఈ మూవీ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతుందని నమ్ముతున్నాడు. ఇటు ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమలోనూ అదే వినిపిస్తోంది. 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ చేసింది ఆర్ఆర్ఆర్ మాత్రమే. ఇప్పటికే ఆరేళ్లు కావొస్తోంది. ఇటు ఇతర హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజ్ వచ్చింది. అతని టాలెంట్ అందరికీ తెలిసింది. దాన్ని తన ఇమేజ్ గా మార్చుకుని రేంజ్ పెంచుకోవాలనే కాస్త ఆలస్యమైన దేవరతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. మొదట ఒకే పార్ట్ గా అనుకున్నా.. తర్వాత రెండు భాగాలు అని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఫస్ట్ పార్ట్ ను పూర్తి చేసి.. తర్వాత వార్2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనేది ఎన్టీఆర్ ఆలోచన. నిజానికి దేవర షూటింగ్ ను డిసెంబర్ వరకూ పూర్తి చేస్తారు అని భావించారు. కాస్త ఆలస్యం అయింది. ఇప్పటి వరకూ హీరోయిన్ కు సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరణ కాలేదట. అయితే ఈ మూవీలో హీరోయిన్ ది కేవలం నామమాత్రపు పాత్రే అని చెబుతున్నారు. అంటే సింపుల్ గా పాటలకే పరిమితం చేస్తారంటున్నారు. ఈ టైమ్ లో సడెన్ గా సినిమా వాయిదా పడిందనే వార్తలు ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే ఇవి రూమర్సా లేక నిజంగానే అందుకు బలమైన కారణాలున్నాయా అంటే ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ కు ఓ మేజర్ సర్జరీ జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే నెల రోజుల పాటు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. దీంతో షూటింగ్ లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా ఇవ్వలేదని టాక్. మామూలుగానే తను ఇచ్చినప్పుడే సంగీతం తీసుకోవాలనే డిమాండ్ పెడతాడు అనిరుధ్. కానీ పెద్ద హీరో, దర్శకుడు కాబట్టి వీరికి ఇన్ టైమ్ లోనే మ్యూజిక్ ఇస్తాడు అనుకుంటే వీళ్లకూ లేట్ చేస్తున్నాడు. ఈ రెండు కారణాల వల్ల అనుకున్న టైమ్ లో దేవరను విడుదల చేయడం సాధ్యం కాదేమో అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. అదే ఈ మూవీ వాయిదా పడుతుంది అనే వార్తలు రావడానికి కారణమైంది. మరి నిజంగా వీళ్లు ఏప్రిల్ 5న వస్తారా లేక ఈ రూమర్స్ నే నిజం చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా.. అనిరుధ్ లాంటి సంగీత దర్శకులపై పూర్తిగా డిపెండ్ అయితే కూడా కష్టమే అని మరోసారి ప్రూవ్ అయింది.